చనిపోతున్నా..నీ లవర్‌ను పెళ్లాడు :  భర్త చివరి కోరిక - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోతున్నా..నీ లవర్‌ను పెళ్లాడు :  భర్త చివరి కోరిక

March 16, 2018

వివాహేతర సంబంధం  ఓ అమాయకున్ని బలి తీసుకుంది. భార్య చేసిన తప్పుకు తను శిక్ష విధించుకున్నాడు.  నేను చనిపోతున్నా నీ లవర్‌ను పెళ్లాడి క్షేమంగా ఉండూ అదే నా చివరి కోరిక అని భార్యకు చెప్పి..సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయాడు.

యాదాద్రి జిల్లా శామీర్‌పేట్‌లో ఈ ఘటన జరిగింది.  ఆలేరు మండలానికి చెందిన 24 ఏళ్ల ఆచారికి రెండేళ్ల క్రితం ఉషారాణితో వివాహం అయ్యింది. వారికి ఏడాది వయసున్న పాప కూడా ఉంది. అయితే  ఈ మధ్యే బతుకుదెరువు కోసం ఆచారి భార్య పిల్లలతో శామీర్ పేట్ వెళ్లాడు.

అయితే  ఈక్రమంలో  ఉషారాణి పొరుగింట్లో  ఉండే శ్రీకాంత్ తో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో  అతను మానసికంగా కృంగిపోయాడు. వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘‘అమ్మానాన్న నన్ను క్షమించండి. నేను జీవితంలో విఫలమయ్యాను. ఎవరికీ నాలాంటి కొడుకు ఉండొద్దు. నా భార్య ఉషను శ్రీకాంత్‌కిచ్చి పెళ్లి చేయండి. ఇదే నా చివరి కోరిక. ఇందులో నా భార్య ఉష మరియు వాళ్ల అమ్మానాన్న తప్పేం లేదు. వాళ్లను తప్పుబట్టొద్దు’’ అని ఆచారి సూసైడ్ లెటర్ రాసి  ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.