పురుషాధిపత్య దేశం ఏదంటే ముందుగా మన దేశం పేరునే చెప్పుకోవచ్చంటున్నాయి కొన్ని సర్వేలు. ఆర్థిక అసమానతలే కాకుండా, మహిళలపై దాడులు, నేరాలు.. మరెన్నో ఇందుకు కారణం.
అలాంటి నిందమోసుకు తిరుగుతున్న పురుషలోకం నుంచ కొందరు పుణ్య పురుషులు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు.
సాధారణంగా పెళ్లయన మహిళ ఇంటిపేరు మారిపోతుంది. భర్త ఇంటి పేరు, అతగాడి పేరు చేరిపోతాయి. అయితే తమిళనాట ఈ సంప్రదాయానికి కొందరు గండికొట్టారు. ఇళంగోవన్ తన పేరు చివర భార్య గీత పేరు చేర్చుకని ఇళంగోవన్ గీత అయ్యాడు. కార్తికేయన్ తన పేరు చివర తండ్రి పేరును కాకుండా తల్లి పేరు తగిలించుకుని కార్తికేయన్ హేమలత అయ్యాడు. సేతుపతి కూడా తల్లిపేరు చేరుకుని సేతుపతి ఉత్తరమణిగా మారిపోయాడు.
లింగ వివక్షకు వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీరు తెలిపారు. అయితే ఉద్దేశం బాగానే ఉన్నా కాలానికి తగ్గట్టు మారని చట్టాల కారణంగా వీరికి చెప్పలేనన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. తొలి సమస్య ఆఫీసుల నుంచే ఎదువరువుతోంది. ఇలా పేర్లు మార్చుకుంటే చాలా టెక్నికల్ ఇష్యూలు వస్తాయని చెబుతున్నాయి. జీతాలు, పీఎఫ్.. మరెన్నో విషయాల్లో తేడాలు కొడుతున్నాయి. స్నేహితులపై భయంకరమైన పరాచికాలు ఆడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే వీరిని ఆడవారి కింద జమకట్టి లవ్ ప్రపోజల్స్ చేస్తున్నారట.
దన్యూస్ మినిట్ సౌజన్యంతో..