భర్త అంతిమ సంస్కారాల్లో ఐదు రోజుల కుమార్తెతో భార్య మార్చ్.... - MicTv.in - Telugu News
mictv telugu

భర్త అంతిమ సంస్కారాల్లో ఐదు రోజుల కుమార్తెతో భార్య మార్చ్….

February 24, 2018

ఓ మహిళా ఆర్మీ అధికారి కుముద్ డోగ్రా ,ఆమె తన ఐదు రోజుల కుమార్తెతో కలిసి తన భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొంది. ఈ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం అసోంలోని మాజులీ ఐస్‌ల్యాండ్‌లో ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక హెలీకాప్టర్  కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముకుద్ భర్త దుష్యంత్  మరణించాడు.దుష్యంత్ అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన నెటిజనులు తీవ్రమైన ఆవేదన చెంది పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘ఇది చాలా బాధాకరమైన విషయం. మేజర్ కుముద్ డోగ్రా తన ఐదు రోజుల కుమార్తెను ఒడిలోకి తీసుకుని, భర్త భౌతికకాయం వద్ద మార్చ్ చేయడం  కలచి వేస్తోందని’ పేర్కొన్నారు. మరో నెటిజన్‘ ఈ ఫోటో చాలా భావోద్వేగమైంది.ఎంతో ధైర్యసాహసాలు కనబరిచిన కుముద్‌కు దేశంలోని   కోట్లమంది భారతీయుల తరుపున సలాం ’అని పోస్టు చేశారు.