వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్.. కేటీఆర్... - MicTv.in - Telugu News
mictv telugu

వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్.. కేటీఆర్…

February 24, 2018

బయో ఆసియా సదస్సు  ముగింపు కార్యక్రమానికి కేంద్రమంత్రి సురేశ్ ప్రభు, తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇద్దరు  నేతలు పాల్గొని  మాట్లాడారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్ వ్యాక్సిన్ రాజధానిగా అవతరించిందని పేర్కొన్నారు.

జీడీపీ కంటే ఫార్మా రంగం వృద్ది రేటు తగ్గిందని, దేశంలో ఫార్మా రంగం అభివృద్ది కోసం ఎలాంటి చర్యలను తీసుకోవాలనుకుంటున్నారని, ఈ రంగంలో పెట్టుబడిదారులకు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారని సురేష్ ప్రభును కేటీఆర్‌ అడిగారు.  భారత్‌ విపణికి అనుగుణంగా ఔషధాల ధరల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో  వివరించాలని కోరారు.

సురేష్ ప్రభు మాట్లాడుతూ…. ఫార్మా రంగం వృద్ధి కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఫార్మా రంగంతో పాటు ప్రజారోగ్యం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. పేదల ఆరోగ్య రక్షణ విషయంలో  ఎక్కడ రాజీపడేది లేదని స్పష్టం చేశారు.