పోకిరీలతో కాళ్లు మొక్కిచ్చుకుంది..హ్యాట్సాఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

పోకిరీలతో కాళ్లు మొక్కిచ్చుకుంది..హ్యాట్సాఫ్

November 20, 2017

ఎయిర్ పోర్టులో కూడా పోకిరీల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో 5గురు యువకులు అసభ్యంగా,మాట్లాడుతూ,ఫోటోలు తీస్తూ వేధించారు. దీనితో ఆ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే పోలీసులు ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోకిరీలు ఆ మహిళకు దండంపెడుతూ ‘ప్లీజ్ మేడం, కేసు పెట్టద్దు మేడం, తప్పైంది మేడం’ అని ఆ ఉద్యోగిని ప్రాధేయపడ్డారు. ‘నా కాళ్లమీద పడి క్షమాపణ అడగండి, కేసు పెట్టను’ అని ఆ ఉద్యోగి చెప్పడంతో అందరు పోకిరీలు ఆ మహిళ కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరారు, దీనితో  పోలీసులు వారిని విడిచిపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పోకిరీలతో కాళ్లు పట్టించుకున్న ఆ మహిళను అందరూ శభాష్ అంటున్నారు.