హైదరాబాద్ విమానాశ్రయానికి అరుదైన రికార్డు... - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ విమానాశ్రయానికి అరుదైన రికార్డు…

March 7, 2018

జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ మరోసారి  రికార్డు సృష్టించింది. 2017 ఏడాదికిగాను నిర్వహించిన ఏఎస్‌క్యూ (ఎయిర్ సర్వీస్ క్వాలిటీ) పాసింజర్స్ సర్వేలో హైదరాబాద్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 50 లక్షల నుంచి 1.5 లక్షల ప్రయాణీకులను రవాణా కేటగిరీలో హైదరాబాద్  విమాశ్రయానికి విశిష్ఠత లభించింది.మాంట్రియల్‌కు చెందిన ఏసీఐ (ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) ఈ అవార్డును ప్రకటిచింది. స్థిరమైన, నాణ్యమైన సేవలను ప్రయాణీకులకు అందిస్తోందని ఏసీఐ తెలిపింది.గత పదేళ్లలో హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ గుర్తింపు దక్కడం ఇది నాలుగోసారి. 2014లో ఏసీఐ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న తొలి ఎయిర్‌పోర్ట్ కావడం విశేషం.