బాల్య వివాహం నుంచి బయటపడిన ఓ యువతి క్రికెట్లో జాతీయస్థాయిలో అద్బుతంగా రాణింస్తోంది. హైదరాబాద్కు చెందిన అనూషకు గత ఏడాది తల్లిదండ్రులు ,బంధువులు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న రాచకొండ పోలీసులు ఆ పెళ్లిని ఆపేశారు.
అనూష ఆటల్లోె ఎక్కువ ఆసక్తి చూపడంతో పోలీసులు ప్రోత్సహించారు. ఇటీవల జరిగిన అండర్ -19జాతీయ స్థాయి మహిళా క్రికెట్ మ్యాచ్లో అనూష ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దాంతో రాచకొండ పోలీసు కమీషనర్ ఎం. భగత్ అనూషను ఘనంగా సత్కరించారు.
అనూష సంరక్షణ పోలీసుశాఖ చూసుకుంటుంది. అంతేకాక ఆమెకు అవసరమైన ఆర్థిక సాయం కూడా పోలీసులు చేస్తున్నారు. అనూష తన జీవితంలో ఎదిగేందుకు అన్ని సదుపాయల్ని మేము కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
అనూషకు బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందించిన బాలల హక్కు సంఘం అధ్యక్షుడు అచ్చుతరావు చేతుల మీదగా తల్లిదండ్రుల సమక్షంలో అనూష అవార్డును అందుకుంది. అనూష త్వరలో అండర్- 19తో పాటు రగ్బీ టోర్నమెంట్లో కూడా ఆడనుంది. ఆమె రగ్బీ కూడా ఆడగలదని పోలీసులు తెలిపారు.