జిమ్నాస్టిక్స్‌లో హైదరాబాద్ అమ్మాయి మెరుపులు - MicTv.in - Telugu News
mictv telugu

జిమ్నాస్టిక్స్‌లో హైదరాబాద్ అమ్మాయి మెరుపులు

March 15, 2018

హైదరాబాద్ అమ్మాయి అరుణారెడ్డి  ప్రపంచస్థాయి జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో కాంస్యపతకం సాధించి కొత్త చరిత్రను సృష్టిచింది.  ఈ ఈవెంట్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. ప్రపంచకప్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్టిక్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. కాంస్య పతకం సాధించే వరకు అరుణారెడ్డి  ప‍్రపంచానికి పెద్దగా పరిచయం లేదు. ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

అరుణ ఐదేళ్ల వయసులో కరాటే నేర్చకోవడం ప్రారంభించి , మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్‌ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్‌ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో కోచ్‌ బ్రిజ్‌‌కిశోర్‌ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ, ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్టిక్‌గా ఎదిగింది. ఇప్పుడు ప్రపంచకప్‌లో అరుణారెడ్డి ప్రదర్శనకు సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చింది.