సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై  అత్యాచారయత్నం... - MicTv.in - Telugu News
mictv telugu

సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై  అత్యాచారయత్నం…

March 17, 2018

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీలో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థినిపై నలుగురు యువకులు అత్యచారయత్నానికి పాల్పడ్డారు. బాధిత యువతి క్యాంపస్‌లో తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు ఆమె స్నేహితుడిని బెదిరించారు. ఆపై ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో వారు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

ఈ ఘటనకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని యూనివర్సిటీ యాజమాన్యం డిమాండ్ చేస్తోంది.