‘హాక్ ఐ అప్లికేషన్’ ద్వారా చోరీ అయిన ఫోన్ల రికవరీ

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువులా మారింది. అయితే అలాంటి ఫోన్ చోరీ అయితే పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. ఫోన్ పోయిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కూడా దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు పోలీసులు చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఫోన్ దొంగల ముఠాకు చెక్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసిన కొన్ని రోజుల్లోనే దొరకపట్టి ఇస్తున్నారు. ఇదంతా పోలీసులు తీసుకొని వచ్చిన ‘హాక్ ఐ’ మొబైల్ అప్లికేషన్ ద్వారా సాధ్యమవుతుందని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.

Telugu News hyderabad city police recovering stolen mobile phones with hawk eye application .

ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. హాక్ ఐ యాప్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను కనిపెడుతునట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. 2లక్షల విలువైన ఫోన్లను గుర్తించి, ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా భాదితులకు ఫోన్లు అందచేశామన్నారు. హాక్ ఐ యాప్ ద్వారానే 35 విలువైన ఫోన్ల ఆచూకీని కనిపెట్టినట్టు తెలిపారు. హాక్ ఐ యాప్‌ను నగరంలో 9లక్షల మంది ఉపయోగిస్తున్నారని, ఈ విషయంలో ప్రజలు సహకరించాలని సిపి కోరారు. ఈ యాప్ ద్వారానే గత మూడు నెలల్లో 24 ఫోన్స్ రికవరీ చేయగలిగామన్నారు అంజనీకుమార్.

Telugu News hyderabad city police recovering stolen mobile phones with hawk eye application