మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య

March 8, 2018

హైదరాబాద్ దిల్‌షుఖ్ నగర్ మెట్రోస్టేషన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.మలక్ పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గుర్తు తెలియని కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతను ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాడనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.