మా డబ్బుతో మేం తాగితే మీకేంటి ? - MicTv.in - Telugu News
mictv telugu

మా డబ్బుతో మేం తాగితే మీకేంటి ?

April 17, 2018

హైదరాబాద్ ‌నగరంలో  డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులను మధ్యం మత్తులో వాహనదారులు ఇష్టం వచ్చినట్లు తిడున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు సహకరించకుండా పోలీసులకు చుక్కలు చూపెడుతున్నారు. తాజాగా ఏప్రిల్ 11న రాత్రి రాజేంద్రనగర్ ఎస్సై తన సిబ్బందితో కలిసి ఆరాంఘర్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.అదే సమయంలో శంషాబాద్ మండలం రషీద్ గూడకు చెందిన చెన్నమ్మ, ఆమె కొడుకు శ్రీశైలం కాలినడకన వెళ్తున్నారు. మద్యం మత్తులో ఉన్న చెన్నమ్మ, శ్రీశైలంలు అక్కడే ఉన్న పోలీసులను బండ  బూతులు తిట్టారు. అంతేగాక, ‘మా డబ్బుతో మేం తాగితే మీకేంటి?’ అంటూ గొడవకు దిగారు.వారిని ఎస్సై ఎంత వారించినా కూడా వినకపోయే సరికి రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.