చార్జింగ్ లేదని ప్రయాణికులను దించేసిపోయారు - MicTv.in - Telugu News
mictv telugu

చార్జింగ్ లేదని ప్రయాణికులను దించేసిపోయారు

March 2, 2018

బస్సు ఎక్కడైనా చెడిపోతే ప్రయాణికులను మరొక బస్సు ఎక్కించి పంపిస్తారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం  టికెట్లు జారీ చేసే(ఈ-పాస్) మెషిన్ చార్జింగ్ అయిపోయిందనే నెపంతో ప్రయాణికులను బస్సు నుంచి దించేశారు. దీంతో వారు నడిరోడ్డుపై మిట్టమధ్యాహ్నం  దిక్కుదోచక అల్లాడిపోయారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్  పరిధిలోని హెచ్‌ఎంటీ రోడ్డు‌లో గురువారం జరిగింది.ఈ-పాస్ మెషిన్ చార్జింగ్ అయిపోందని కండక్టర్ అందర్నీ దించేశాడు. ఇదెక్కడి విచిత్రమని ప్రయాణికులు ప్రశ్నించగా అదంతే అని అన్నాడు. దీంతో ప్రయాణికులు చేసేదేమీ లేక బస్సు దిగారు. అటువైపు ఆర్టీలు బస్సులు రాకపోవడంతో చాలాసేపు ఎదురుచూసి ఇతర బస్సుల్లో ప్రయాణించారు. కండాక్టర్‌ ముందుగానే మెషిన్‌ను చెక్‌ చేసుకొని ఉండాల్సిందని, తప్పు అతనిది పెట్టుకుని తమను ఇబ్బంది పెట్టాడని  ప్రయాణికులు మండిపడ్డారు.