mictv telugu

కోహ్లీ ఫోటో వాడుకున్నారు.. రూ.10 వేలు ఫైన్ కట్టారు..

February 13, 2019

టీవీల్లో, పేపర్లలో సెలెబ్రిటీలు ప్రకటనల్లో కనిపిస్తే వాళ్ళు సదరు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటాం. ఇందుకోసం ఆయ కంపెనీలు సెలెబ్రిటీలకు రెమ్యూనరేషన్ చెల్లించి వాళ్లతో ప్రకటనలు చేయించుకుంటుంది. వారి ఫోటోలు, వీడియోలతో ప్రచారం చేసుకుంటాయి. కానీ హైదరాబాదులో ఓ కంపెనీ ఓ సెలెబ్రిటీ ఫోటోను వాడుకుని తన కంపెనీకి తెగ ప్రచారం చేసుకుంటోంది. శ్రీమాన్‌ ఫ్యాషన్‌ క్లాథింగ్‌ సంస్థ.. ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌కోహ్లి ఫొటోలతో ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో చాలా మంది కోహ్లీ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నారు. కానీ అదంతా వట్టి కథే. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి బి.ఆకాశ్‌కుమార్‌ గతేడాది నవంబరులో తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం (రిడ్రెసెల్‌ సెల్‌) సలహా కేంద్రంలో ఫిర్యాదు చేశారు.

Telugu news Hyderabad Garment firm fined for using Virat Kohli s pic 

విచారణ చేపట్టిన సలహాకేంద్రం షాపు యాజమాన్యం కోహ్లి అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో వారికి రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఫిర్యాదు చేసిన ఆకాశ్‌కుమార్‌కు ఇవ్వగా.. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను ఉచితంగా పరిష్కరిస్తున్న సలహా కేంద్రానికే ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆకాశ్‌కుమార్‌ నిర్ణయించుకుని, చెక్కును అకున్ సబర్వాల్‌కు అందజేశారు. అనంతరం అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. ‘సమాజంలో వివిధ రూపాల్లో చోటుచేసుకుంటున్న మోసాలను గుర్తించడంలో వినియోగదారుల పాత్ర కీలకమైంది. ప్రముఖుల ఫొటోలు, పేర్లను వారి అనుమతి లేకుండా ప్రచారానికి వినియోగించొద్దు. ఇలాంటి కేసు తమ విభాగానికి రావడం ఇదే తొలిసారి’ అని అన్నారు. ఫిర్యాదు చేసిన ఆకాశ్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అతనిలాగే ప్రతి ఒక్కరూ మోసాలను గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.Telugu news Hyderabad Garment firm fined for using Virat Kohli s pic