హైదరాబాద్ లో వాటర్ ఏటీఎంలు... - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ లో వాటర్ ఏటీఎంలు…

August 26, 2017

డబ్బులిచ్చే ఏటీఎంల మాదిరి కాయిన్లు వేయగానే నీళ్లిచ్చే ఏటీఎంలు హైదరాబాద్ లో దర్శనమివ్వనున్నాయి.  మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ తో కలసి ఎన్టీఆర్ గార్డెన్ వద్ద వాటర్ ఏటీఎంను ప్రారంభించారు. మహానగరంలో ఏడాది చివరి నాటికి 200 వాటర్ ఏటీఎలను ఏర్పాటు చేస్తామని మేయర్ తెలిపారు.

ఈ ఏటీఎంలను  స్వీడన్ జోషెఫ్, నేచర్స్ స్ప్రింగ్ స్ంస్థలు ఏర్పాటు చేశాయి. జీహెచ్ఎంసీ జలమండలి సహకారంతో వీటిని నిర్వహిస్తారు. ఈ వాటర్ ఏటీఎం ద్వారా రూ. 1కి  ఒక గ్లాస్, రూ.2కి లీటర్ వాటర్, రూ. 5కి 10 లీటర్లు రూ. 10కి 20 లీటర్ల నీళ్లను జీహెచ్ఎంసీ అందించనుంది.

హైదరబాద్ నగర ప్రజలకు వేసవిలో నీళ్ల సమస్య ఎదురవకుండా ఉండటానికి, ప్రజలకు కాలుష్య రహిత మంచినీరుఅందింంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యమని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.