ఇవాంకా ముచ్చట.. సమన్వయకర్తగా కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా ముచ్చట.. సమన్వయకర్తగా కేటీఆర్

November 29, 2017

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా  మహిళా పారిశ్రామిక నైపుణ్యాభావృద్ది అంశంపై బుదవారం  ఫ్లీనరీ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ఇవాంకా ట్రంప్‌ పాల్గొనగా.. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్ , డెల్ సీఈవో క్వింటోస్ కూడా ముచ్చటించారు.

ఇవాంక మాట్లాడుతూ…. మహిళా పారిశ్రామికవేత్తలు  తమ నైపుణ్యాన్ని ఇంకా మెరుగు పరుచుకుని మరింత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటుగా వ్యాపార బాధ్యతలకు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.

చందా కొచ్చర్ మాట్లాడుతూ…. తమ ఐసీఐసీఐ బ్యాంకు మహిళా వ్యాపారవేత్తలను , మహిళలను ప్రోత్సహిస్తుందని, తాము మహిళల కోసం ప్రత్యేక విధానాలను అవలంబిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగల్సిన అవసరముందని అన్నారు. ఈ సదస్సులో మెుత్తం 25 సమావేశాలు జరగనున్నాయి. వ్యాపార మెలకువలు, నైపుణ్య , అభివృద్ది, మహిళల భాగస్వామ్యం అంశాలపై చర్చ జరగనున్నాయి.