వారి ఉంపుడుగత్తెలతో మీకేం పని? - MicTv.in - Telugu News
mictv telugu

వారి ఉంపుడుగత్తెలతో మీకేం పని?

February 8, 2018

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సకల నేరస్తుల సర్వేపై హైకోర్టు ఆగ్రహాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వే సమయంలో  పౌరుల వద్దకు వెళ్లి ఎలా ప్రశ్నిస్తారని మండిపడింది.  నేరస్తుల సర్వే అంటూ నార్త్ జోన్ డీసీపీ ,మారేడుపల్లి పోలీసులు తనను వేధిస్తున్నారని మాజీ కార్పొరేటర్ ,హైదరాబాద్ టీడిపీ నేత చిర్రబోన బద్రీనాథ్ యాదవ్ వేసిన పిటీషన్  విచారించిన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఓ వ్యక్తికి నీ లాయర్ ఎవరు?నీకు అప్పులు ఎవరు ఇస్తున్నారు? నీ ఉంపుడు గత్తెలెవరు?  వంటి ప్రశ్నలను అడగడం పౌరుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం’ అని  జస్టిస్ వెంకటశేషసాయి మందలించారు.వారి వివరాలను తీసుకుని ఏం సాధించాలని అనుకుంటున్నారని న్యాయమూర్తి పోలీసుశాఖను ప్రశ్నించారు. ఓ వ్యక్తి తరుపున లాయర్ ఎవరో చెప్పాలని ఒత్తిడి పెట్టడం చట్ట నిబంధనలకు విరుద్ధమని తెలియదా ?అని ప్రభుత్వం తపున వాదించే న్యాయవాదిని , న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇటువంటి  ప్రశ్నాపత్రాలు న్యాయ నిపుణులు సంప్రందించకుండా ఎలా తయారు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సమగ్ర ఖైదీల సర్వే పేరిట పౌరుల నుంచి బలవంతంగా సేకరణ పై పోలీసుల నుంచి వివరణ తీసుకుని ,కోర్టు ముందుంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.