ఐమాక్స్‌లో మార్నింగ్ షో రద్దు.. ప్రేక్షకుల నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

ఐమాక్స్‌లో మార్నింగ్ షో రద్దు.. ప్రేక్షకుల నిరసన

December 7, 2018

తెలంగాణ జనమంతా  ఓటు వేయడానికి పల్లెలకు పయనమయ్యారు. దీని ప్రభావం హైదరాబాద్ నగరంలోని ఐమాక్స్ థియేటర్‌ నిర్వహణపైనా కనిపించింది. థియేటర్లో మార్నింగ్ షోను రద్దు చేశారు.  ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ ప్రేక్షకులు థియేటర్‌కు చేరే సరికి షో రద్దు అని బోర్డు కనిపించింది. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు.Telugu News Hyderabad Imax Theatre Morning Show Cancel For Telangana Assembly Electionsఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకునే ముందే షో రద్దు చేస్తున్నామని పేర్కొంటే తాము టికెట్స్ బుక్ చేసుకునే వాళ్లం కాదని, ఇక్కడి వరకు వచ్చే వాళ్లం కూడా కాదని థియేటర్ యాజమాన్యంపై మండి పడుతున్నారు. కాగా సిబ్బంది మొత్తం ఓటు హక్కును వినయోగించుకోవడానికిి వెళ్లడంతోనే మార్నింగ్ షోను రద్దు చేశామని యాజమాన్యం పేర్కొంటుంది. అలాగే నగరంలోని చాలా థియేటర్లలో పోలింగ్ సందర్భంగా ఉదయం సినిమా ప్రదర్శనలను రద్దు చేశారు. దీంతో సినీ ప్రేక్షకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.