ఇవాంకాకు ఏమేం పెడతారంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకాకు ఏమేం పెడతారంటే..

November 21, 2017

ఈ నెల 29న జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు వ్యక్తిగత సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే.  ఆ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆమెకు అదిరిపోయే విందును ఏర్పాటు చేయలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గోల్కొడ కోట వేదిక  అద్భుతమైన విందును ఇచ్చి , తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటాలని  భావిస్తున్నారు. ఈ బాధ్యతను ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ తీసుకున్నారు.ట్రంప్ కూతరురికి..  హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే …పతర్ కా గోస్ట్ , షీర్ కుర్మా, డబుల్ కా మిఠా, బగారే బైగాన్ , దమ్ కా బిర్యానీ, కుర్బానీ కా మీఠా, ఇరానీ చాయ్, రవ్వ లడ్డు వడ్డిస్తారు. అలాగే ఇతర భారతీయ వంటకాలతోపాటు చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరేబియన్ వంటకాలను కూడా తయారు చేయించనున్నారు. వీటిని వండడానికి చేయితిరిగిన చెఫ్‌లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయని సమాచారం.. హైదరాబాద్ పర్యాటక ఇవాంకాకు చిరకాలం గుర్తుండేలా వంటకాలను తయారు చేయించనున్నారు.