హైదరాబాద్-కర్నూలు దారిలో 50 బండ్ల ఢీ.. భారీ ట్రాఫిక్ జామ్

అసలే పొగమంచు.. పైగా సంక్రాంతి ప్రయాణాలతోపాటు రహదారులు ప్రమాదాలకు నెలవులుగా మారుతున్నాయి. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిపై ఈ రోజు షాద్‌నగర్, కొత్తూరుల మధ్య పొగమంచు వల్ల భారీ సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి గుద్దుకున్నాయి. ఫలితంగా  కొందరు గాయపడ్డా, భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.Telugu news Hyderabad-Kurnool highway traffic jam as vehicles colludes in fog at shadnagar and kothur villagesమంచు వల్ల ముందువెళ్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో వెనక వస్తున్న వాహనాలు ఢీకొన్నాయి. 50కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిందని, నెమ్మదిగా తొలగిస్తున్నామని పోలీసులు చెప్పారు.Telugu news Hyderabad-Kurnool highway traffic jam as vehicles colludes in fog at shadnagar and kothur villages