మెట్రో రైల్ చకచక.. సెల్ఫీలు పటపట... - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో రైల్ చకచక.. సెల్ఫీలు పటపట…

November 29, 2017

హైదరాబాద్  మెట్రో రైలు ఈ రోజు ఉదయం 6 నుంచి ప్రజల కోసం పరుగులు తీసింది. ప్రయాణికులు సంబరంతో సెల్ఫీలు తీసుకున్నారు. తొలి రోజు లక్ష మంది ప్రయాణిస్తారని భావిస్తున్నారు.

మెట్రో రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. నాగోల్ నుంచి మియాపూర్ మార్గం వరకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెుత్తం 24 మెట్రో స్టేషన్లు ఉన్నాయి.  

మెట్రో ద్వారా రోజుకు 3 లక్షల  మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అన్నారు. మెట్రో ద్వారా ప్రయాణం చేయడానికే ఇప్పటికే చాలా మంది స్మార్ట్ కార్టులను కోనుగోలు చేశారు. మెట్రో కనీస చార్జి రూ. 10, గరిష్ట చార్జి రూ. 60గా నిర్ణయించారు.  మెట్రో రైలుకు 3 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 330 మంది ప్రయాణించవచ్చు. మెుత్తం రైలులో వెయ్యి మంది ప్రయాణించే వీలు ఉంది. ప్రయాణికుల రద్దీని బట్టి మెట్రో కోచ్‌ల సంఖ్యను ప్రభుత్వం పెంచనుంది.

మెట్రో తొలి టికెట్ కొన్న మహిళను అధికారులు అభినందించి బహుమతిని బహుకరించారు.