మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం..

February 6, 2018

హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం స్టేషన్‌లో వెల్డింగ్ పనులు చేస్తుండగా  నిప్పు రవ్వలు ఎగిసి పడ్డాయి. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మెట్రో సిబ్బందికి  స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు  ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని ఆడిట్ విభాగంలోని మంటలు వ్యాపించి  ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కంప్యూటర్,  కొన్ని ముఖ్యమైన దస్తావేజులు, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి.

సకాలంలో రెండు ఫైరింజన్లు చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశాయి. దాదాపుగా గంటసేపు అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటన ఎలా జరిగింది అనే దానిపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.