మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టేవేత.. ఆధారాల్లేవు.. - MicTv.in - Telugu News
mictv telugu

మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టేవేత.. ఆధారాల్లేవు..

April 16, 2018

సంచలనం సృష్టించిన హైదరాబాద్ మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు సోమవారం కొట్టివేసింది. 9 మందిని బలిగొన్న ఈ పేలుడులో ఐదుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా వదిలేసింది. దేవేందర్‌గుప్తా, లోకేశ్‌ శర్మ, స్వామి అసీమానంద, భరత్‌ భాయి, రాజేందర్‌చౌదరిలపై నేరాభియోగాలను ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది.

కోర్టు తీరుపై జాతీయ ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమీక్షిస్తున్ననట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపారు. తీర్పు కాపీ చూశాకే  తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కోర్టు,పాతబస్తీ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

2007 మే 18న పాతబస్తీలోని చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదులొ ఐఈడీ బాంబు పేలడంతో తొమ్మిది మంది చనిపోగా 58 మంది గాయపడ్డారు. పేని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఆ సమయంలో మసీదులో ఐదువేల మంది ఉన్నారు. పేలుడు తర్వాత జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 9 మంది మృతిచెందారు. వీటిపై సీబీఐ దర్యాప్తు జరిపింది. ఉగ్రవాద దాడి కావడంతో 2011లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు కేసును అప్పగించారు. పదిమంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. అసీమానంద అరెస్టుతో కుట్రకోణం వెలుగులోకి వచ్చింది.

సాక్షులు మాట మార్చారు..

ఈ కేసులో 2014 తర్వాత చాలామంది సాక్షులు తమ మాటను మార్చారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఐఏపైన రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు.  కేంద్రం  ప్రభుత్వం ఈ కేసులో అమాయకులను ఇరికించిందని, సంఘ్ పరివార్‌ను అప్రతిష్టపాలు చేసే పని చేసిందని అన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందని త్రీవంగా మండిపడ్డారు