ప్రియా ప్రకాశ్ డైరెక్టర్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసు  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా ప్రకాశ్ డైరెక్టర్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసు 

February 19, 2018

కనుసైగలతో కోట్ల గుండెల్లో గుబులు రేపిన మలయాళ యువని ప్రియా ప్రకాశ్ నటించిన ‘ఒరు ఆదార్ లవ్ ’ సినిమా విడుదల కాకముందే పలు సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. ఈ మలయాళ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ పాట వల్ల  ముస్లింల మనోభావాలు ఘోరంగా దెబ్బ తిన్నాయని హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ పాటను వెంటనే సినిమా నుంచి తొలగించాలని హైదరాబాద్ నుంచే కాదు పలు నగరాల నుండి ముస్లిం సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి.

కాగా హైదరాబాద్ పోలీసులు ఇవాళ ఆ కేసులో ఒరు ఆదార్ లవ్ మూవీ డైరక్టర్ ఒమర్ లులూకు నోటీసులు జారీ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆయన వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో డైరక్టర్‌ను పోలీసులు కోరారు. ఈ కేసు విచారణ కోసం పోలీస్ టీమ్ కేరళకు వెళ్లింది.