ధనలక్ష్మి హైదరాబాద్‌కు వచ్చిందా?  మరో రూ. 7.70 కోట్లు

ఎన్నికల సమయం.. పైగా పోలీసుల తనిఖీలు.. తిష్టవేసిన ధనలక్ష్మి.. దొరుకుతున్న నోట్లకట్టలు.. కొన్ని రోజులుగా ఇవే వార్తలు..! అయినా అక్రమార్కులు ఏమాత్రం భయపడ్డం లేదు. నోట్ల కట్టలను పుస్తకాల కట్టల్లా పబ్లిగ్గా గమ్యస్థానాలకు చేర్చేస్తున్నారు. దొరికితేనే కదా దొంగ అన్నట్టు లెక్కల్లో చేరని డబ్బు యథేచ్ఛగా రోడ్లపై దూసుకుపోతోంది.

rr

హైదరాబాద్ లోని సైఫాబాద్, బంజరాహిల్స్  ప్రాంతాల్లో ఈ రోజు తనిఖీల్లో రూ. 7.70 కోట్ల డబ్బు వెలుగు చూసింది. కారులో రూ. 5 కోట్లు, డిక్కీల్లో మిగతా నోట్లకట్టలు బయటపడ్డాయి. అన్నీ పెద్దనోట్లే. రసీదులు, బ్యాంకు వివరాలు వంటి లెక్కలు చూపకపోవడంతో ఇది హవాలా డబ్బుగాని, లేకపోతే ఎన్నికల కోసం పంచడానికి తరలిస్తున్న డబ్బుగాని అయివుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కట్టలను హారాష్ట్ర, ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క.. బంజారాహిల్స్‌, షాఇనాయత్‌గంజ్‌ ప్రాంతాల్లో రూ.2.70 కోట్ల నగదును తనిఖీల్లో పట్టుబడింది. రాజకీయ నేత ఇంటికి దగ్గర్లోనే దొరకడంతో ఇది ఎన్నికల డబ్బు కావొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నెలరోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాదాపు రోజూ నోట్లపాములు చిక్కుతున్నాయి.

tt

Telugu news Hyderabad police seized Rs. 7.7 crores in vehicle checking at Saifabad, Banjara hills arrested four people on the eve of Telangana assembly elections