ప్రేమకు నో చెప్పింది లైవ్‌లో ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమకు నో చెప్పింది లైవ్‌లో ఆత్మహత్య

March 15, 2018

తను మనసు పడిన అమ్మాయి ప్రేమను నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌‌లోని నేరేడ్‌మెట్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. సాగర్ అనే ఐటీఐ విద్యార్థి గత కొంతకాలంగా ఓ అమ్మాయి ప్రేమిస్తున్నాడు. అయితే  ఆమె నికాకరిస్తూ వస్తోంది. ఆందోళనక గురైన సాగర్ వాట్సాప్‌లో చాట్ చేస్తూ… ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నా చావును నువ్వు చూడాలి .వెంటనే వీడియో కాల్ చెయ్ ’ అని మెసేజ్ చేశాడు. దాంతో అమ్మాయి వీడియో కాల్ చేయగా ఆమె చూస్తుండగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అ అమ్మాయి మాత్రం సాగర్ నిజంగా ఆత్మహత్య చేసుకుంటాడని తెలియక, స్నేహితురాలితో కలిసి సరదాగా వీడియో చూస్తోంది.  సాగర్ నిజంగానే ఉరేసుకోవడంతో నివ్వరపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. సాగర్ మెదక్ జిల్లా బాబుసాయిపేట్‌కు చెందినవాడిగా తెలుస్తోంది.