ఈ పసివాడి నేరమేంటి? పుట్టడమే తప్పా? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పసివాడి నేరమేంటి? పుట్టడమే తప్పా?

March 14, 2018

ఆరేళ్ల బాలుడిని తల్లి ప్రియుడు విచక్షణ రహితంగా హింసించాడు. ప్లాస్టిక్ తీగలతో తీవ్రంగా కొట్టాడు. శరీరంపై వాతలు వచ్చేలా బాాదాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్  పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయమ్మ భర్త మృతిచెందడంతో కుమారుడు పవన్ కుమార్(6)తో కలిసి నగరంలోని బోరబండ మోతీనగర్  సమీపంలో బబ్బుగూడకలో అద్దె ఇంటిలో ఉంటోంది. ఇళ్లలో పాచిపనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు కారు గ్రైవర్ పెద్దిరాజుతో పరిచయం ఏర్పడింది. ఏడాదిగా ఇద్దరూ సహజీవనం చేస్తోంది.

పవన్ బబ్బుగూడలోని ప్రభుత్వం పాఠశాల్లో 1వ తరగతి చదువుతున్నాడు. అతణ్ని పెద్దిరాజు తరచూ హింసిస్తూ, తల్లిలేని సమయంలో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. సోమవారం సాయంత్రం పవన్‌కుమార్‌ అల్లరి చేస్తున్నాడంటూ పెద్దిరాజు ప్లాస్టిక్‌ తీగలతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ముఖం, వీపు, కాళ్లు, చేతులపై తీవ్రంగా కొట్టడంతో వాతలు తేలాయి.

పవన్ ఏడుస్తూ పరుగెడుతున్నా వదలకుండా వెంటపడి మరీ కొట్టాడు. బాలుడి ఆర్తనాదాలను విన్న స్థానికులు పెద్దిరాజును పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పవన్‌ను ఆస్పత్రికి తరలించారు.నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.