మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా‘ డీజే’ భామ - MicTv.in - Telugu News
mictv telugu

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా‘ డీజే’ భామ

March 14, 2018

ముకుంద’  సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూజా హెగ్డే. ఆ తర్వాత‘ఒకలైలా కోసం‘ ‘డిజే’  తదితర చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు ఇప్పుడు ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’2017గా ఎంపికైంది. హైదరాబాద్‌కు సంబంధించిన టైమ్స్ గ్రూప్ ఈ జాబితాను తయారు చేసింది.

ఈ జాబితాలో పూజా తొలిస్థానంలో నిలువగా,కాజల్ రెండో స్థానంలో నిలిచింది.  రకుల్ ప్రీత్ సింగ్ నాలుగో స్థానంలో నిలువగా ,తర్వాత స్థానంలో బ్యాండ్మెటన్ పీవి.సింధు,ఆదాశర్మలు నిలిచారు. ఆరవ స్థానంలో తమన్నా,ఏడవ స్థానంలో సిమ్రాన్ చౌదరి,8వ స్థానంలో సృష్టి వ్యాకరణం ,9వ స్థానంలో అనుష్క శెట్టి,10వ స్థానంలో మిథాలీ రాజ్ నిలిచారు.

గత ఏడాది మొదటి స్థానంలో ఉన్న కాజల్ రెండోస్థానికి,రెండో స్థానంలో ఉన్న అనుష్క 9వ స్థానానికి ఆమాంతం పడిపోయారు. హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్  మెన్ గా బషీర్ అలీ నిలువగా,రెండవస్థానంలో విజయ్ దేవరకొండ నిలిచిన సంగతి తెలిసిందే.