యాచకురాలిపై హత్యాచారం.. - MicTv.in - Telugu News
mictv telugu

యాచకురాలిపై హత్యాచారం..

April 11, 2018

రోజురోజుకు ఆడవాళ్లపై ఆకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు యాచకురాలిపై కర్కశంగా వ్యవహరించాడు. అత్యాచారంచేసి, తర్వాత విషయం బయటపడుతుందేమోనని చంపేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ బాలనగర్ పరిదిలో సోమవారం రాత్రి జరిగింది.సంగారెడ్డి జిల్లా ఆంధోల్‌కు చెందిన దుర్గమ్మకు ముగ్గురు కూతుర్లు. వారు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. సురారం పరిధిలో యాచించే చిన్న కూతురు (40) సోమవారం రాత్రి మద్యం తాగి గుడెన్‌మెట్ బస్టాప్ వెనుక హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ ప్రదేశంలో ఉంటున్న తల్లి దగ్గరకు వచ్చింది. రాత్రి  తల్లీకూతుళ్లు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కూతురి నోరు, కాళ్లు చేతులను టేపుతో కట్టేసి హత్యాచారం చేశాడు. ఉదయం పారిశుధ్య కార్మికులు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్నిచేరుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

‘అత్యాచారం చేసిన వ్యక్తే ఆమెను హత్యచేశాడా? లేదా టేపు చుట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటుందా?’ అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని సీఐ బి.కిషన్ కుమార్ తెలిపారు.