ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి14 సందర్భగా జీహెచ్ఎంసీ ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించనుంది. ఆ రోజును చెత్త విడాకుల దినోత్సవంగా నిర్వహించాలని కోరుతోంది. తడి,పొడి చెత్తను వేరు చేయడం, సేంద్రియ ఎరువుల తయారీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారాలు, జోనల్ మునిసిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14ను ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటుంటే నగరంలో మాత్రం చెత్త విడాకుల దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. అత్యధిక పాన్ ప్రియులు ఉన్న హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో బహిరంగంగా ఉమ్మి వేయడం తగ్గిందని డాక్టర్ పట్టాభిరాం అన్నారు. వ్యక్తిగతంగా, ఇళ్లలో, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెస్కో విజయ్‌కుమార్ తెలిపారు.