క్షమాపణలు చెప్పలేదు కానీ..య్యూట్యూబ్ నుండి  వీడియో డిలీట్ చేశారు   - MicTv.in - Telugu News
mictv telugu

క్షమాపణలు చెప్పలేదు కానీ..య్యూట్యూబ్ నుండి  వీడియో డిలీట్ చేశారు  

November 26, 2017

గురువారం హైపర్ ఆది జబర్దస్త్‌లో అనాథలను అవహేళన చేస్తూ ‘అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి పుట్టే సంతానమే అనాథలు’ అనే డైలాగు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మా మనసులు గాయపడ్డాయంటూ..జబర్ధస్త్ షో ద్వారానే మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ  హైపర్ ఆది మరియు జబర్ధస్త్ పై అనాథ పిల్లలు పోలీస్టేషన్లో  కేసులు పెట్టారు. పలు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కూడా హైపర్ ఆది.. పిల్లల హక్కులను ఉల్లఘించాడంటూ  హ్యూమన్ రైట్స్‌కి ఫిర్యాదు చేశాయి.

అయితే ఈ విషయంపై tv9  ఏర్పాటు చేసిన డిబేట్‌లో ‘మా ఇల్లు ప్రజాదరణ’ ఆర్గనైజర్ పూజితతో పాటు , సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిపై జబర్దస్త్ జడ్జ్  నాగబాబుకు ఫోన్ చేయగా ‘అసలు  ఈవిషయంపై ప్రేక్షకులకు లేని బాధ.. మీడియాకు, మహిళా సంఘాలకు ఎందుకు, మేమెవ్వరికీ సమాధానం చెప్పం’ అని ఫోన్ పెట్టేశారు. దీనిపై  హైపర్ ఆదికి ఫోన్ చేయగా ‘అసలు తాను అనాథ పిల్లలను అనలేదని, చెడ్డ తల్లిదండ్రులను గురించి చెప్పేందుకే అలా అన్నానని, తను ఏ తప్పు చేయలేదని’ అన్నాడు.

 ‘తప్పు చేసి మళ్లీ దానిని సమర్థించుకుంటున్నావా ఆది, ఇక నుంచైనా ఈ బూతు రాతలు ,వ్యక్తులను, సమాజాన్ని కించపరచడం మానుకో అని మహిళా సంఘాలు ఆదిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దీనిపై జబర్ధస్త్ యాంకర్  అనసూయ మాట్లాడుతూ ‘ కామెడీని కామెడీలానే చూడాలని, లాజిక్ లు వెతికితే కామెడీ పండదని, అయినా ఇదంతా నవ్వించడానికే అని చెప్పుకొచ్చింది.

అయితే  విషయం రోజు రోజుకు పెద్దది అవుతుండడంతో, ఈటీవీ వారు ఏమనకున్నారో ఏమో మరి. నిన్నటి దాకా య్యూట్యూబ్ లో ఉన్న హైపర్ ఆది గురువారం చేసిన స్కిట్ ను తొలగించింది. ‘మరి నేనేమి తప్పు చేయలేదని తనని తాను సమర్థించుకుంటున్న  ఆది, మరి స్కిట్‌ను య్యూట్యూబ్ నుండి ఎందుకు తొలగించారు అని అనాథాశ్రమాలు నిలదీస్తున్నాయి. తప్పు చేశారు కాబట్టే  ఓ మెట్టు దిగి స్కిట్‌ను డిలీట్ చేశారు. అయినా సరే ఎక్కడైతే మమ్మల్ని అవమాన పరిచారో అదే స్టేజీమీద మాకు క్షమాపణ చెప్పే వరకు మేం ఊరుకోం అని అనాథాశ్రమ పిల్లలు ఈటీవీకి,హైపర్ ఆదికి వార్నింగ్ కూడా ఇచ్చారు.