నేను హిందువును.. రంజాన్ జరుపుకోను - MicTv.in - Telugu News
mictv telugu

నేను హిందువును.. రంజాన్ జరుపుకోను

March 7, 2018

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఎప్పటిలానే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ నేను హిందువునై వుండి రంజాన్ పండగ ఎందుకు చేసుకోవాలి ’ అన్నారు. ఇటీవల హోలీ పండగ ఏడాదికి ఒకసారే వస్తుంది.. నమాజ్ ప్రతిరోజూ చేసేదే అని మాట్లాడిన యోగి ఇప్పుడు మళ్ళీ వివాదాస్పదంగా మాట్లాడి విమర్శలు కొనితెచ్చుకున్నారు.

యూపీ అసెంబ్లీ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతోంది. విపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేతలు, రాహుల్ గాంధీలను టార్గెట్ చేసిన యోగి ‘ నేను హిందువునైనందుకు గర్వపడుతున్నాను. హిందువునైవుండి ఈద్ జరుపుకోను. నేను వారిలా వెర్రి మత విశ్వాసాలతో ఆడుకోను. గుళ్లో దారాలు కట్టుకొని, ఇంకోచోట టోపీ పెట్టకొని, మరోచోట మోకాళ్లపై కూర్చొని ప్రార్థనలు చేయటం తనకు రాదు ’ అని అన్నారు.