నేనైతే  శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేవాణ్ణి కాను.. మురళీ మోహన్ కామెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

నేనైతే  శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేవాణ్ణి కాను.. మురళీ మోహన్ కామెంట్

April 19, 2018

కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డిపై నటుడు, ఏపీ ఎంపీ మురళీ మోహన్ ఫైర్ అయ్యారు. ‘ నిరసన చేసే హక్కు ప్రతీ ఒక్కరికీ వుంది. కానీ శ్రీరెడ్డి చేసింది చాలా తప్పు. ఆమె చేసిన అర్థనగ్న ప్రదర్శన ఆమోదయోగ్యంగా లేదు. క్రమశిక్షణ లేని వారికి ‘మా’లో సభ్యత్వం ఇవ్వరు. మా అధ్యక్షుడిగా నేను ఉంటే… ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేవాణ్ణి కాను ’ అని తేల్చి చెప్పారు మురళీ మోహన్. కాగా ఆయన వ్యాఖ్యలను శ్రీరెడ్డి తరుపువాళ్ళు తప్పు బడుతున్నారు.‘ టాలీవుడ్‌లో ఎప్పటినుంచో కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎందరో అమ్మాయిల బట్టలు ఊడదీసి పూర్తి నగ్నంగా వాడుకున్నారు. అంత చేసినవారికన్నా శ్రీరెడ్డి చేసింది తప్పు కాదు. ఇండస్ట్రీ ఎప్పుడో అమ్మాయిని బట్టలు ఊడదీసి నిలబెట్టింది. అదే ఆమె చెప్పింది ’ అనే వాదనలు వినిపిస్తున్నాయి.