పెళ్ళాం కోరికలు తీర్చే శక్తి నా దగ్గర లేదు.. సల్మాన్ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్ళాం కోరికలు తీర్చే శక్తి నా దగ్గర లేదు.. సల్మాన్

February 24, 2018

సల్మాన్ ఖాన్ పెళ్ళి గురించి సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందనేది వేల డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ? చివరికది ప్రశ్నగానే మిగులుతుందేమోనని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి ? ఫోర్బ్స్‌ లిస్ట్‌ లో అగ్రస్థానంలో ఉన్న ఓ సెలబ్రిటీ‌, బాలీవుడ్ స్టార్ అయిన సల్లూభాయ్ పెళ్ళి విషయంలో ఇంకా స్పష్టత లేకపోవటం గమనార్హం

తాజాగా ముంబైలో ఓ ఈవెంట్‌కు హాజరైన సల్మాన్‌ వద్ద మీడియా వివాహ ప్రస్తావన తీసుకు వచ్చింది. దానికి ఆయన బీదవాడి మాదిరి సమాధానం ఇచ్చాడు. ‘ వివాహం అనేది ఖర్చుతో కూడుకున్న పని. పెళ్ళి ఖర్చు, పెళ్ళయ్యాక పెళ్ళాం ఖర్చులు, ఆమె కోరికలు తీర్చటానికి ఖర్చులు, పిల్లల ఖర్చులు ఇలా తడిసి మోపడయ్యే ఖర్చులుంటాయి. అన్ని ఖర్చులు భరించగలిగే స్తోమత నాకు లేదు. నా దగ్గర అంత శక్తి లేదు.

నా తండ్రి వివాహానికి కేవలం రూ.180 మాత్రమే ఖర్చు అయ్యింది. కానీ, ఇప్పుడు పెళ్లిళ్లంటేనే లక్షల నుంచి కోట్లతో ముడిపడిన వ్యవహారం. అందుకే నేను ఇంకా ఒంటరిగానే ఉన్నా’ అన్నాడు సల్మాన్. 2014లో సోదరి అర్పిత వివాహాం కోసం కోట్లు కుమ్మరించి దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వేడుకలు నిర్వహించిన సల్మాన్‌ నోట ఇలాంటి మాట రావటం కాస్త కామెడీగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓ నిరుపేద మాట్లాడినట్టే సల్మాన్ మాట్లాడాడని అంటున్నారు.