లావయ్యానని.. వద్దన్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

లావయ్యానని.. వద్దన్నాడు..

December 2, 2017

భర్తకు బట్టతల వున్నా, బానంత పొట్ట ఉన్నా, ఎత్తుపళ్లున్నా, చివరికి నడవలేని కుంటివాడైనా, గుడ్డివాడైనా భార్య చచ్చినట్టు కాపురం చేస్తుంది. కానీ భర్తల్లో కొందరు  మాత్రం భార్యలకు వంకలుపెడతారు. లావుగా వున్నావని, తెల్లగా లేవని, జడ పొడుగ్గా లేదని, లేదంటే ఆడపిల్ల పుట్టిందని  బద్నాం చేస్తూ.. వదిలించుకోవాలని చూస్తుంటారు.  తాజాగా భార్య లావయ్యిందంటూ ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నాడు ఓ భర్త. బాచుపల్లి పోలీస్ ప్టేషన్ పరిధిలో ప్రగతి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది.రాజచంద్ర డెలాయిట్ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి నవంబర్ 2015 లో ఉప్పల్‌కు చెందిన రంగయ్య, అనిత దంపతుల కుమార్తె అమూల్యతో వివాహం జరిగింది. పెళ్ళయిన మూణ్ణెల్ల తరువాత వేధింపులు మొదలు పెట్టాడు. లావుగా వున్నావని, కళ్ళద్దాలు వున్నాయని వంకలు పెట్టేవాడు. అది చాలదన్నట్టు అదనపు కట్నం తేవాలని కూడా వేధించడం మొదలు పెట్టాడని అమూల్య ఆరోపిస్తూ భర్త మీద కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని అత్తింటి ముందు ఆందోళనకు దిగింది బాధిత మహిళ. ఆమెకు మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి.

 సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇరు వర్గాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి మాట్లాడారు. కోర్టులోొ కేసు నడుస్తున్నందున సమస్యను కోర్టు  లేదా మధ్యవర్తుల ద్వారానే పరిష్కరించుకోవాలి.. ఇలా ఆందోళన చేయటం సరికాదని పోలీసులు సూచించారు.