నాకు పిల్ల దొరికిందోచ్.. సల్మాన్ ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకు పిల్ల దొరికిందోచ్.. సల్మాన్ ఖాన్

February 6, 2018

నాకు నచ్చిన పిల్ల దొరికిందోచ్ ’ అంటూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. ‘ 50 ఏళ్ళు దాటిన సల్మాన్‌కు అమ్మాయి నచ్చిందంటే ఇప్పుడైనా పెళ్ళి పీటలు ఎక్కుతాడని ’ అనుకుంటున్నారు అతని అభిమానులు. సల్మాన్ విషయంలో బ్యాచిలర్ అనే పదానికే విసుగు వచ్చేలా ప్రవర్తిస్తున్నాడని ముద్దుగుమ్మలు చాలా మంది అసూయపడ్డ సందర్భాలు ఉన్నాయి.

 ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, లూలియా వంటూర్, ఇప్పుడు ఈ అజ్ఞాత అమ్మాయి? ‘ఈ అమ్మయినైనా పెళ్లి చేసుకొని బ్యాచిలర్ లైఫ్‌కు మంగళం పాడితే బాగుండు ’ అని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ‘టైగర్ జిందా హై’ సినిమాతో విజయాన్ని అందుకున్న సల్లూ ప్రస్తుతం ‘ రేస్ 3 ’ సినిమాలో నటిస్తున్నాడు.

కాగా కొంత కాలంగా సల్మాన్, బ్రిటీష్ అమ్మాయి లూలియా వంటూర్‌తో సాన్నిహిత్యంగా వుంటున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆమెనే పెళ్లి చేసుకుంటాడనే పుకార్లు కూడా షికార్లు చేశాయి. కానీ అది కూడా సస్పెన్స్ వీడిన ఉత్తుత్తి ముచ్చటే అయింది. వారిద్దరి బంధం తెగిపోయిందనే వార్తలు వినిపించాయి. లూలియా కూడా ‘ సల్మాన్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే ’ అని వివరించింది. ఆమె మాటలతో ఇంక వారి బంధం పూర్తిగా బద్దలైనట్టేనని అనుకున్నారు. కాగా ఇప్పుడు సల్మాన్ తాజా ట్వీట్‌పై అతని పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది.