తన వ్యాధి పేరేంటో చెప్పిన ఇర్ఫాన్ ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

తన వ్యాధి పేరేంటో చెప్పిన ఇర్ఫాన్ ఖాన్

March 16, 2018

తనకు అరుదైన వ్యాధి సోకిందని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు స్వయంగా చెప్పగం  తెలిసిందే. అతని క్యాన్సర్ వచ్చిందని కొందరు అన్నారు. నానా పుకార్లు షికార్లు చేశాయి.  ఇర్ఫాన్‌ ఖాన్ కొన్ని రోజుల అతిథే అన్నట్టు గాలి వార్తలను ప్రచారం చేశారు. వీటిపై అతని భర్య మండిపడింది. ఇర్ఫాన్ కూడా తన అనారోగ్యంపై  వస్తున్న వదంతులపై కలతచెందాడు. తన ఆరోగ్య పరిస్థితి గురించి పది రోజుల్లో వెల్లడిస్తానని అన్నాడు. అన్నట్టుగానే తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. తనకు న్యూరో ఎండోక్రిన్‌ ట్యూమర్‌ (నాడుల్లో  కణతి ) ఉందని పేర్కొన్నాడు. అలాగే న్యూరో అంటే బ్రెయిన్‌కు సంబంధించింది మాత్రమే కాదని వివరణ ఇచ్చాడు. విదేశాల్లో దీనికి సంబంధించిన చికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుణిగా తిరిగొస్తానని వెల్లడించాడు.

 తన ట్వీట్‌లో తొలుత.. ‘మనం ఊహించినదేదీ జీవితం మనకు ఇవ్వదు ’ అన్న మార్గరెట్ మిచెల్ కొటేషన్‌ను జతచేశాడు. ‘ఒక్కోసారి మనం ఊహించనిది మనల్ని పెద్దవాళ్ళను చేస్తుంది. నాకా వ్యాధి సోకిందని తెల్సినప్పుడు షాకయ్యాను.  నాకు ఆ వ్యాధి సోకడమా.. అని అంగీకరించటానికే చాలా టైం పట్టింది. ఒక దశలో తట్టుకోలేకపోయాను. ఆందోళన చెందాను. కానీ నా చుట్టూ ఉన్న వారి ప్రేమ, బలం నన్ను కొత్త ఆశలోకి తీసుకొచ్చాయి. ఇదో కొత్త ప్రయాణం.. ఆరోగ్యం కోసం దేశం దాటి వెళ్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు కొండంత బలాన్ని ఇస్తాయి. మీ ప్రేమ నాలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. నా మాటలకోసం ఎదురు చూసేవారందరి కోసం తిరిగొస్తానని ఆశిస్తున్నాను.. ఇట్లు మీ.. ఇర్ఫాన్ ’ అని పేర్కొన్నాడు.

న్యూరో ఎండోక్రిన్‌ ట్యూమర్‌

ఇది నాడీమండలానికి సంబంధించినది. వేగంగా లేదా నెమ్మదిగా పెరుగుతుంటుంది. శరీరంలోని ఇతర అవయవాలకు కూడా పాకొచ్చు. చాలామందికి దీని లక్షణాలు అంత త్వరగా తెలియవు గుర్తించలేరు. అనుకోని సంఘటన జరిగి దానిద్వారా పరీక్షలు చేస్తేనే ఈ వ్యాధి బయటపడుతుంది. చర్మం కందిపోయినట్లుగా కనిపించడం, లేదా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అమాంతం పెరిగిపోవడం జరుగుతాయి. ఇక వైద్యం అనేది కణితి తీవ్రతను బట్టి ఉంటుంది. రేడియేషన్‌ లేదా కీమోథెరపీ ద్వారా మాత్రమే వైద్యం చేయించుకోవలసి వుంటుంది.