నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా ?.. సాయిపల్లవి - MicTv.in - Telugu News
mictv telugu

నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా ?.. సాయిపల్లవి

February 27, 2018

‘ సాయిపల్లవికి టైమింగ్ సెన్స్ లేదు. షూటింగ్‌కి తను సరైన సమయానికి రాకపోవటం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఫిదా సినిమా సాయిపల్లవి వల్లే హిట్టవలేదు.. అది సమిష్ఠి కృషి ’  అని ఆ మధ్య హీరో నాగశౌర్య సాయి పల్లవి మీద కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై సాయి పల్లవి ఎప్పుడు సమాధానం చెప్తుందా అని చాలా మంది ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు తెర దించింది సాయి పల్లవి.నాగశౌర్యతో కలిసి నటిస్తున్న తాజా తమిళ సినిమా ‘ కరు ’ తెలుగులో ‘ కణం ’ పేరుతో విడుదల అవుతోంది. నాగశౌర్య తన మీద ప్రకటించిన అసహనం గురించి తెలుసుకున్న సాయపల్లవి ముందుగా కణం సినిమా దర్శకుడికి ఫోన్ చేసిందట. ‘ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారా ? ’ అని అడిగిందట. అందుకు ఆ దర్శకుడు అలాంటిదేం లేదని చెప్పాడట. ‘ నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డా అది అవతలి వారికన్నా నాకే ఎక్కువ బాధ కలిగిస్తుంది. నా సహనటుడైన నాగశౌర్య వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా ’ అని చెప్పింది.