నాక్కాబోయేవాడు నాకన్నా హైట్ వుండాలి - MicTv.in - Telugu News
mictv telugu

నాక్కాబోయేవాడు నాకన్నా హైట్ వుండాలి

March 23, 2018

అమ్మాయిలు ఎప్పుడూ తనకన్నా ఎత్తు ఎక్కువగా వున్న మగాణ్ణే పెళ్ళాడాలనుకుంటారు. ఆ ఖాతాలోకి ఇప్పుడు నటి రకుల్ ప్రీత్ సింగ్ చేరింది. తనను పెళ్లాడబోయేవాడు తనకంటే పొడగరి అయి ఉండాలని ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. తన ఎత్తు 5.9 అడుగులని, తనకు కాబోయేవాడు అంతకు మించిన ఎత్తుకలవాడై ఉండాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మంచి మనసుతో పాటు పొడగరి అయి వుండాలనుకుంటోంది రకుల్.

కెరటం ’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి రాకెట్‌లా దూసుకొచ్చి అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. సినిమాలు ఎప్పటికీ శాశ్వతం కాదని ముందుచూపుగా విదేశీ నిపుణులతో జిమ్‌ను పెట్టుకుని సైడ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటోంది. తాను నటిని కావాలనుకోలేదని చెప్పింది. పాకెట్‌‌మనీ కోసమే నటించేందుకు కెమెరా ముందుకొచ్చానని చెప్పింది. అలా సరదాగా ప్రారంభమైన తన నటనా ప్రస్థానం సీరియస్‌గా ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చింది.

నిబద్ధత వుంటే జీవితానికి ప్రణాళికలతో అవసరం లేదని అభిప్రాయపడింది. తనలో చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావాలుండటం వల్లే పరిణతి పెరిగిందని వివరించింది. అందుకే తాను మంచి సినిమాలను ఎంచుకొని మంచినటిగా కొనసాగుతున్నాను అంది. పదేళ్ల తరువాత వెనుదిరిగి చూసుకుంటే చేసిన ప్రతి సినిమా గుర్తుండిపోవాలని పేర్కొంది.