పెళ్లి వార్తపై  నితిన్ క్లారిటీ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి వార్తపై  నితిన్ క్లారిటీ

March 5, 2018

‘నితిన్ పెళ్లికొడుకాయెనె ’ అంటూ సోషల్ మీడియా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కుర్రహీరో పెళ్ళికొడుకు మాదిరి పంచెకట్టులో వున్న ఫోటోను పెట్టి నెటిజన్లు పెళ్లి అని టముకేసి చెప్తున్నారు. ఈ వార్త నితిన్‌కు చేరటంతో దీనిమీద తన ట్విటర్ ఖాతాలో క్లారిటీ ఇచ్చారు.‘నాకప్పుడే పెళ్లేంటి ? ఇంకా టైముంది.. అవన్నీ పుకార్లు’ అంటూ ట్వీట్ చేశాడు. పెళ్ళి బట్టల్లో వున్న తన ఫోటోలు ‘ శ్రీనివాస కళ్యాణం ’ అనే కొత్త సినిమాకు సంబంధించినవి అని చెప్పాడు. దిల్‌రాజు నిర్మాణంలో ‘ శతమానం భవతి ’ సినిమా దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఆదివారం ప్రారంభమైంది ఈ చిత్రం షూటింగ్.