ముమైత్‌కు మూర్ఛవ్యాధి.. అందుకే సినిమాల్లేవు - MicTv.in - Telugu News
mictv telugu

ముమైత్‌కు మూర్ఛవ్యాధి.. అందుకే సినిమాల్లేవు

April 16, 2018

‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ’ పాటతో దూసుకువచ్చింది ఐటంగర్ల్ ముమైత్ ఖాన్. ‘పోకిరి’ సినిమాలోని ఆ ఒక్క పాటతో చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఐటం సాంగ్స్‌కి స్టెప్పులు వేసి కుర్రకారును ఉర్రూతలూగించింది. చివరగా ‘ తిక్క’ సినిమాలో నటించింది. ‘బిగ్ బాస్ ’ షోలో కనిపించిన తర్వాత మరెక్కడా కనిపించలేదు. కాగా తాను ఇన్నాళ్ళు కనపడకుండా వుండటానికి గల కారణాన్ని ముమైత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

తనకు మూర్ఛ వ్యాధి సోకిందని చెప్పింది. రెండేళ్ల పాటు తాను మూర్ఛ వ్యాధితో బాధపడ్డానని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నానని చెప్పింది. ఎలాంటి బరువులు ఎత్తకూడదని వైద్యులు చెప్పడంతో ఇంట్లోనే పూర్తి విశ్రాంతిలో వున్నాను. ఈ క్రమంలో తాను చాలా లావై పోయానని,  దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదని వివరించింది. పూర్తిగా కోలుకున్నాక ఫిట్‌నెస్ కోసం కసరత్తులు మొదలు పెడతానని చెప్పింది.

తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకున్నానని,  ఓ సంస్థను ఆశ్రయించినట్టు చెప్పింది. ప్రతిరోజు మంచి భోజనం చేయటం, రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవటం వల్ల జీవితంలో మంచి మార్పులు సంభివిస్తాయని ముమైత్ చెప్పింది.