నా బిడ్డను ఇలా కాపాడుకుంటా.. సన్నీలియోని - MicTv.in - Telugu News
mictv telugu

నా బిడ్డను ఇలా కాపాడుకుంటా.. సన్నీలియోని

April 14, 2018

కశ్మీర్ బాలిక అసిఫా ఉదంతం దేశాన్ని కదిలిస్తోంది. పసిపాప అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆ మృగాళ్ళ మీద రోత వ్యక్తమవుతోంది.

ఆడపిల్లలను కన్నవాళ్ళు గుప్పిటలో భయంతో వణికిపోవాల్సి వస్తోంది. ఓ సమాజమా? ఎటు పోతున్నావు? అని ప్రతి ఒక్కరు  ప్రశ్నిస్తున్నారు. ప్రముఖులు సోషల్ మీడియాలో ఉద్వేగభరిత పోస్టులు పెడుతున్నారు.

తాజాగా నటి సన్నీలియోని చేసిన ఓ ట్వీట్‌ చాలా మంది మనసులను కదిలిస్తోంది. తన కూతురు(దత్త పుత్రిక) నిషాకౌర్‌ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ట్వీట్ చేసింది సన్నీ.‘ బిడ్డా.. ఈ లోకంలో నానాటికీ చెడు పెరిగిపోతోంది. నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకోవటానికి నా హృదయం, దేహం, ఆత్మ ఎప్పటికీ నీకు కాపలాగా ఉంటాయి. నీ రక్షణ కోసం నా ప్రాణాలను పణంగా పెడతాను.  ప్రస్తుతం చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. వారిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’ అంటూ పోస్ట్ చేసింది.