నేను రాసిన పుస్తకాన్ని కొని చదవగలరు ! - MicTv.in - Telugu News
mictv telugu

నేను రాసిన పుస్తకాన్ని కొని చదవగలరు !

February 2, 2018

నటుడిగా విభిన్న పాత్రల్లో అలరించిన ప్రకాశ్‌రాజ్ ఇప్పుడు కలం పట్టి తనలోని రచయితను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో తను రాసిన పుస్తకాన్ని అందరూ కొని చదవగలరని కోరాడు. తన మాతృభాషైన కన్నడలో ఈ పుస్తకాన్ని రచించినట్టు తెలిపాడు. ‘ ఇరువుదెల్లవ బిట్టు ’ అనే పేరుతో ఈ పుస్తకాన్ని ఫిబ్రవరి 4 న మార్కెట్లోకి విడుదల చేస్తున్నాడట. ‘ నవ కర్ణాటక ’ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఈ పుస్తకం అందుబాటులో వుందని ప్రకటించాడు. ‘ ఇన్నాళ్ళూ నటుడిగా అలరించిన ప్రకాశ్‌రాజ్ రచయితగా ఏ మేరకు అలరిస్తాడోననే ’ కామెంట్లు వినబడుతున్నాయి.

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య తర్వాత నుండి మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అయిన ప్రకాశ్‌రాజ్ ఈ పుస్తకంలో ఏం చెప్పబోతున్నాడు ? అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొని వున్నది.