ఎయిర్‌సెల్‌కు షాకిచ్చిన  ఐడియా ! - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌సెల్‌కు షాకిచ్చిన  ఐడియా !

February 7, 2018

ఎయిర్‌సెల్  యూజర్లకు ఐడియా షాకిచ్చింది. పాత బకాయిలను చెల్లించాలని  చాలాసార్లు ఎయిర్‌సెల్‌కు నోటీసులు పంపించనప్పటికీ కూడా ఎయిర్ సెల్ స్పందించలేదు. దాంతో ఐడియా, ఎయిర్‌సెల్‌తో ఉన్న ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఎయిర్‌సెల్ బకాయిలన్నింటినీ చెల్లించిన తర్వాతనే ఇంటర్‌కనెక్ట్ సర్వీసులను మళ్లి కనెక్ట్ చేస్తామని చెప్పింది. అయితే ఎంత మొత్తం ఎయిర్‌‌సెల్ బాకి పడిందో ఐడియా స్పష్టం చేయలేదు.

2017లో నవంబర్ నుంచి పలుమార్లు బకాయిలు చెల్లించాలని ఎయిర్‌సెల్‌ను కోరాం.. కానీ ఆపరేటర్ బకాయిలను చెల్లించడంలో ఎయిర్‌‌సెల్ విఫలమైందని ఐడియా చెప్పింది. ఇంటర్‌కనెక్ట్  అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

యూజర్ల ప్రయోజానాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌సెల్ బకాయిలను చెల్లిస్తుందని ఆశిస్తున్నట్టు  ఐడియా సంస్థ తెలిపింది. అయితే ఈ విషయంపై ఎయిర్‌సెల్ మాత్రం స్పందించలేదు.