రూ. 998తో రోజుకు 5జీబీ.. ఐడియా ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 998తో రోజుకు 5జీబీ.. ఐడియా ఆఫర్

March 23, 2018

ఐడియా మరో సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. రూ.998తో ఈ ప్యాక్‌ కింద రోజుకు 5జీబీ 4జీ/2జీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. అంతేకాదు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను 35 రోజులపాటు అందిస్తోంది. ప్రీపెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్యాక్‌ తొలుత ఒడిశా సర్కిల్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అన్నీ ప్రాంతాలకు ఈ ఆఫర్‌ను విస్తరించనున్నారట. ఐడియా మ్యాజిక్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ లేకుండా ఇదే రకమైన ప్రయోజనాలను కర్నాటక సర్కిల్‌ వారికి కూడా 28 రోజుల పాటు ఐడియా ఆఫర్‌ చేస్తోంది.