ఐడియా, వోడాల నుంచి  4జీ ఫోన్లు!

రిలయన్స్ జియోకు పోటీగా టెలికం సంస్థలు 4‌జీ స్మార్ట్‌‌ఫోన్ల విడుదలకు యత్నిస్తున్నాయి.  జియోకు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ తన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టగా… తాజాగా ఐడియా, వోడా ఫోన్ కంపెనీలు కూడా తన 4జీ స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్‌ల్లోకి ఈ  దీపావళి పండుగ సందర్బంగా తీసుకురానున్నాయి. వినియోగదారులకు రూ. 1,500 లేదా అంతకంటే తక్కువ ధరకే 4జీ ఫోన్లను అందించాలని ఐడియా, వోడా ఫోన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐడియా, వోడాఫోన్ రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేయడానికి దేశీయ హ్యాండ్‌సెట్ సంస్థ లావా, కార్బన్‌లతో సంప్రదింపులు జరిపాయి.  దీపావళి కంటే ముందుగా ఈ డీల్స్ చివరి దశకు వస్తాయని లావా  అధికారి గౌరవ్ తెలిపారు. మెుబైల్  ఆపరేటర్లతో చర్చలు జరినట్టు లావా, కార్బ‌న్‌లు కూడా ధ్రువీకరించాయి. ఇవి ఎయిర్ టెల్, రిలయన్స్ జియోకు కౌంటర్‌గా ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నాయి.

SHARE