ఎన్ని డబ్బులిచ్చినా ఆ పని చేయను.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్ని డబ్బులిచ్చినా ఆ పని చేయను..

November 21, 2017

మనం టీవీలో రోజూ కొన్ని వందల ప్రకటనలు చూస్తుంటాం. అందులో బ్యూటీ క్రీమ్‌ల ప్రకటనలు కూడా ఉంటాయి. హీరోయిన్లు, మోడల్‌లు ‘మేం ఈక్రీములు వాడి తెల్లగా అయ్యాం, మాచర్మం కాంతివంతమయ్యింది, మీరూ వాడండి’ అంటూ చెబుతుంటారు. అలా చెప్పినందుకు లక్షలు,కోట్ల పారితోషికాలు తీసుకుంటారు. కానీ కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు అలాంటి ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. అందరికి అందం పెరుగుతుందని అబద్దాలు చెప్పి కోట్లు తీసుకోవడం తమకు ఇష్టం లేదంటున్నారు. ‘మున్నా మైఖేల్’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యి, తెలుగులో నాగచైతన్య సరసన నటిస్తున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ కూడా అలాంటి ప్రకటనలను తనకు కోట్లు ఇచ్చినా చెయ్యనని చెప్పేసింది. ‘అలా చేస్తే జనాల్ని మోసం చెయ్యడమే అవుతుందని, అది తనకు ఇష్టంలేదని, డబ్బు సంపాదించాలంటే అదొక్కటే మార్గం కాదని చెప్పుకొచ్చింది’ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న ఈ మోడల్.