పిల్లలు కాపీ కొడితే జైల్లో పెడతారా..? - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలు కాపీ కొడితే జైల్లో పెడతారా..?

March 3, 2018

‘ పదో తరగతి పరీక్షల్లో కాపీ కొట్టే పిల్లలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాము ’ అని తెలంగాణ విద్యాశాఖాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై బాలల హక్కుల సంఘం తీవ్రంగా మండిపడింది. ‘ చదువుకునే బాలబాలికలపై క్రిమినల్ కేసుల పెట్టి జైలుకు పంపే చట్టాలు ఈ దేశంలోనే లేవు. చట్టం గురించి తెలుసుకోకుండా ఇంత అజ్ఞానంగా విద్యాశాఖాధికారులు ఇలాంటి హెచ్చరికలు చేసి పిల్లలను భయపెట్టడమే కాకుండా, నేరస్థులుగా చిత్రీకరించడమే అవుతుంది.ముందు వాళ్ళు చట్టాల గురించి తెలుసుకుంటే మంచిది ’ అని బాలల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు నిప్పులు చెరిగారు. దీనిని వ్యతిరేకిస్తూ సీఎంకు లేఖ కూడా రాశారు. పిల్లల హక్కులను కాలరాస్తూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్న విద్యాశాఖ అధికారులపై తక్షనమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.