గూండాగిరి చేస్తే స్పెషల్ స్టేటస్ రాదు పీకే.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

గూండాగిరి చేస్తే స్పెషల్ స్టేటస్ రాదు పీకే.. శ్రీరెడ్డి

April 21, 2018

సంచలన తార శ్రీరెడ్డి ఇప్పుడు డైరెక్టుగా పవన్ కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ‘ గూండాగిరి చేస్తే స్పెషల్ స్టేటస్ రాదు పీకే ’ అంటూ తన ఎఫ్‌బీలో పోస్ట్ పెట్టింది. ‘ ఇదంతా ప్రాస్టిట్యూషన్‌ను లీగలైజ్డ్ చేయాలని అంటున్నది వాకాడ అప్పారావు కోసమా? 3, 4 పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లకా ? ’ అని ప్రశ్నించిన శ్రీరెడ్డి. ‘ నిన్న అమ్మ పేరుతో ఛాంబర్‌కు వచ్చిన నువ్వు ఏ పొలిటికల్ అజెండాతో వచ్చావో తెలుసు. ఫుల్ నెగెటివ్ మార్కులు వేయించుకున్నావుగా. మీ అమ్మకు నువ్విచ్చిన విలువ కన్నా నేనే ఎక్కువ విలువ ఇస్తాను. మా మహిళా సంఘానికి ఆవిడ పేరే పెడతాను. జిందాబాద్ అంజనాదేవీ.. ’ అని పేర్కొంది.అలాగే ఇంకా వరుస పోస్టులలో పవన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది శ్రీరెడ్డి. ‘ నువ్వు చితక్కొట్టింది మీడియా వాళ్ళ కార్లు కాదు. జర్నలిస్టుల మనోభావాలని… కాస్కో నా వాస్కోడిగామా ’ అని పోస్టు పెట్టింది. ‘ బట్టలు విప్పి మాట్లాడుకుందాం ’ అని పవన్ పెట్టిన ట్వీట్‌పై శ్రీరెడ్డి ఘాటుగా సమాధానమిచ్చింది. ‘ కొత్త సినిమా ‘ రాళ్ళేసి కొట్టుకుందాం రా ’ ‘ తిక్కకి లెక్కలేదు ’ ఈ పేరు కూడా బాగుంటుంది. నేను ఏపీలో చంద్రబాబుకు, వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తాను. అయితే నీకేంటి ’ అని పోస్టులో పేర్కొంది శ్రీరెడ్డి.