100 సార్లు పొడిచి చంపారు - MicTv.in - Telugu News
mictv telugu

100 సార్లు పొడిచి చంపారు

November 23, 2017

ఆ వ్యక్తి మీద ఎంత కసి వుంటే మాత్రం వందసార్లు పొడవటమా ? ఒక మనిషిని ఇంత కిరాతకంగా చంపొచ్చా అని యావత్ ప్రపంచం వణికిపోయేలా చేసింది ఈ ఘటన. అమెరికాలో ఓ రౌడీ ముఠా ఓ వ్యక్తిని బుధవారం రాత్రి అతి కిరాతకంగా హతమార్చి పబ్లిక్ పార్కులో పాతి పెట్టారు. సమాచారం తెలుసుకున్న మాన్‌ట్గోమెరీ కౌంటీ పోలీసులు శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. శవం మీద దాదాపు 100 కత్తిపోట్లు వున్నట్టు గుర్తించారు.‘ అల్ట్రా వైలెంట్‌ లాటినో స్ట్రీట్‌ గ్యాంగే ’ ఈ హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.ఒక అనుమానితుణ్ణి అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి హత్యకు కొన్ని వారాల ముందే పక్కా ప్లాన్ వేశారట.  పార్కులో వాకింగ్‌కు వచ్చిన అతణ్ని మాటు వేసి పట్టుకొని 100 సార్లు పొడిచి అతని శరీరాన్ని జల్లెడ మాదిరి పొడిచి చంపారు. వెంటనే ఆ వ్యక్తి తల నరికేసి, గుండెను కోసి బయటకు తీసి పాశవిక ఆనందాన్ని పొందారట.

అల్ట్రా వైలెంట్‌ లాటినో స్ట్రీట్‌‌, మారా సల్వట్రుచా ( ఎంఎస్‌-13 ) అనే గ్యాంగ్‌లు అమెరికాలో ప్రమాదకరంగా మారాయి. ఈ రెండు గ్రూపులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు తుద ముట్టిస్తానని చెప్పాడు. ఎంఎస్‌-13లో దాదాపు 10 వేల మంది గ్యాంగ్‌స్టర్‌లు ఉన్నట్లు సమాచారం ఉంది.